
కొడాలి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాని నానిని మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. నానిని ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. ప్రజెంట్ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నానికి త్వరలోనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు.