కుత్బుల్లాపూర్: సుచిత్ర కూడలిలో గంజాయి పట్టివేత

71చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర కూడలిలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ద్వి చక్ర వాహనం పై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 10కేజీల ఎండు గంజాయి, 2చరవాణిలు, ఒక ద్వి చక్ర వాహనం స్వాదీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలిసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు బళ్ళారి కి చెందిన రాములు కోసం ఎక్సైజ్ పోలీసులు గాలింపుచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్