కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం శివాలయనగర్ లో సోమవారం నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనకు ఎదురైన అవమానాలు భవిష్యత్తు తరాలకు జరగవద్దని ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు.