కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారంలోని సఖి సెంటర్ నుండి సోమవారం రాత్రి ఇద్దరు అమ్మాయిల అదృశ్యం అయ్యారు. రాత్రి 1 గంట ప్రాంతంలో కిటికీ గ్రిల్ తొలగించుకుని 16, 17 ఏళ్ల గల ఇద్దరు అమ్మాయిలు పారిపోయారు. మంగళవారం ఉదయం సూరారం పోలీసులకు సఖి సెంటర్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.