తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో అర్హులైన రైతులం దరికీ ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గడువులోపు రుణ మాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గడువులోపు కాంగ్రెస్ ప్రభు త్వం రుణమాఫీ పూర్తిచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశాడని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.