

చంద్రబాబును అరెస్ట్ చేసింది వైసీపీ కాదు: శ్యామల (వీడియో)
AP: సీఎం చంద్రబాబును గతంలో అరెస్ట్ చేసింది వైసీపీ కాదని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి శ్యామల వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది వైసీపీ కాదని, కేంద్ర సంస్థలు అన్ని ఆధారాలతో అరెస్టు చేశాయని వెల్లడించారు. కాగా, 2023లో ఏపీ సీఐడీ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.