పుట్టుక సమయంలో మరియు చిన్నారులలో ఇతరత్రా సంభవించే గుండె సంబంధిత వ్యాధులను అత్యంత సమగ్రమైన చికిత్సను అందించే అధునాతనమైన హార్ట్ సెంటర్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అత్యాధునిక సదుపాయాలు మరియు నిపుణులైన హృద్రోగ వైద్య బృందం కలిగి పిల్లలకు ఉత్తమ చికిత్సలు అందిస్తుంది. ఇటీవల బెలూన్ డిలేటేషన్ మరియు లెఫ్ట్ వెంట్రిక్యులర్ డివైస్ క్లోజర్ లను కలిపి 27 వారాల పిండంపై గుండె చికిత్సను ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యబృందం విజయవంతంగా నిర్వహించారు. ఈ చికిత్స అత్యంత క్లిష్టమైనది మరియు అపూర్వమైనది. పిండం ప్రాణాలు కాపాడుటకు బృహద్ధమని స్టెనోసిస్ తో వాల్వ్ లోని ప్లాస్టీని చక్కగా నిర్వహించారు. ఈ విధానంలో పంక్చర్ ప్రదేశాన్ని ఒక పరికరం ఉపయోగించి మూసివేస్తారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో అత్యాధునిక సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలు ఎంతో సహకరించాయి. ఈ సంక్లిష్టమైన చికిత్సలో బహుళ రంగ వైద్య బృందం పాల్గొన్నారు. ఈ వైద్య ప్రక్రియలో చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు,పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బఖ్రు, మరియు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీ ఫణి భార్గవి ధూళిపూడి వారి ఆధ్వర్యంలో మెడిసిన్ స్పెషలిస్టులు, పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ ఆబ్జెక్టివ్ బృందం పాల్గొన్నారు. తల్లి గర్భంలోని పిండానికి గుండె చికిత్స అందించటం ఒక అద్భుతమైన అత్యంత సంక్లిష్టమైన వైద్యరంగానికే ఒక సవాలు వంటింది. ఈ చికిత్సకు ఆధునిక ఇమేజింగ్ బృహద్ధమని కవాటం స్థితిని సవరించిన తర్వాత, పంక్చర్ ప్రదేశంను మూసివేయడానికి డివైజ్ (పరికరం) వాడటం పిండం కార్డియాక్ సంరక్షణలో ఒక వినూత్న బెంచ్‌మార్క్‌ను నెలకోల్పినది. పిండం బృహద్ధమని కవాటం స్టెనోసిస్ పిండం మరణానికి లేదా హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చును. బృహద్ధమని వాల్వులో ప్లాస్టీ సాధారణంగా 70% విజయవంతమైన రేటుతో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియకు ఒక చిన్న సూది మరియు మధ్యస్థమైన బెలూన్ ఉపయోగిస్తారు. అయితే శిశువు గుండె నుండి రక్తం లీక్ అయ్యే ప్రమాదాన్ని నివారించుటకు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం పెద్ద సూది మరియు పెద్ద బెలూన్ ఉపయోగించి అల్ట్రాసౌండ్ ద్వారా తల్లి పొట్ట మరియు గర్భాశయం ద్వారా పిండం గుండెలోకి సూదిని పంపారు. అడ్డంకి తొలగింపు మరియు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించటానికి బృహద్ధమని కవాటం ద్వారా బెలూన్ కాథెటర్ పనిచేసింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం పంక్చర్ కప్పిపుచ్చుటకు తొలిసారిగా డివైజ్ ఉపయోగించారు. ఈ విధానం పిండం భద్రతకు భరోసా కల్పిస్తుంది. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా పిండం కార్డియాక్ సమస్యలున్న కుటుంబాలకు ఆశజనకమవుతుంది. ఈ ప్రక్రియ అనంతరం పిండం గుండె పనితీరు మెరుగుపడటంతో చికిత్స అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రసవం తర్వాత ఆ శిశువు గుండెను నిశితంగా పరిశీలించి చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించి మంచి ఆరోగ్యంతో ఆ తల్లి బిడ్డలను డిశ్చార్జ్ చేసారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా రోగుల ప్రయోజనం కొరకు వైద్య విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది. ఈ విజయవంతమైన పిండం కార్డియాక్ చికిత్స గురించి రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పిండం కార్డియాక్ చికిత్స వైద్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటంలో మా నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ఎంతో సున్నితమైన మరియు అధిక-ప్రమాదం పొంచియున్న ఈ చికిత్సను విజయవంతం చేయటం, పుట్టుకకు ముందే జీవితాలను రక్షించు ఆవిష్కరణకు మరియు వైద్య బృందం సమిష్టి కృషికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ "రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోని మా అసాధారణమైన వైద్యుబృందం పీడియాట్రిక్ కార్డియాక్ సంరక్షణలో అద్భుతమైన మైలురాయిని సాధించినందుకు చాల గర్వపడుతున్నాము అన్నారు. రోగుల సంరక్షణ పట్ల మా వైద్యుల అంకితభావం, నైపుణ్యం మరియు నిబద్ధత కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఈ విజయం మా వైద్య బృందం ప్రతిభను చాటి చెప్పటమే కాక, పిల్లల ఆరోగ్య సంరక్షణలో మా నిరంతర ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్స్) మరియు నైపున్యతకు నిదర్శనం అన్నారు. ఈ అపూర్వమైన అత్యుత్తమ విజయ సాధనలో పాల్గొన్న మొత్తం వైద్య బృందానికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ఈ అరుదైన చికిత్స ప్రక్రియ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తుపై మంచి ప్రభావాన్ని చూపుతుందని విశ్వసిస్తునన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి: మల్లిఖార్జున్ ఫోన్ 89786 73555