హైదరాబాద్ గండిపేట్ మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం కారణంగా అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. మంగళవారం ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ప్రస్తుతం ఈ నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటానా స్థలికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చస్తున్నారు.