చాదరాఘాట్ ఇన్‌స్పెక్టర్ రాజుతో పాటు ఎస్ఐ రవిరాజులను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శనివారం సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు ఓ రికవరీ కేసులో బైక్ కనిపించకపోవడం, హత్య కేసులో భారీగా డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. కాగా ఆయన స్థానంలో చార్మినార్ డీఐగా పనిచేస్తున్న బ్రహ్మ మురళికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.