రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో ఉన్న సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంకులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మాధవ్, గోపి అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, లీకైన ఎయిర్ పైపుకు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న మాధవ్, గోపిలకు తీవ్ర గాయాలయ్యాయి.