హైదరాబాద్ నోవెటెల్ హోటల్‌లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి స్వల్ప ప్రమాదం తప్పింది. ఎనిమిది మందికి మాత్రమే ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ ఓవర్ వెయిట్‌కు గురై, ఉండాల్సిన ఎత్తుకంటే లోపలికి దిగిపోయింది. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై వెంటనే లిఫ్ట్ ఓపెన్ చేసి, సీఎంను మరో లిఫ్ట్‌లో సెకండ్ ఫ్లోర్‌కి పంపారు.