హైదరాబాద్: తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు

75చూసినవారు
హైదరాబాద్: తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వడగళ్ల వానతో పాటు, మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది.

సంబంధిత పోస్ట్