శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఉగ్రవాది పట్టుబడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB) అధికారులు మంగళవారం స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వీడియో అని నిర్ధరించారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వివరించారు. నకిలీ వీడియోలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.