ఆర్జీకే పింక్ బిల్డింగ్లో లోని మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడ ఆర్టీజీకే పింక్ బిల్డింగ్ లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ వెంటనే స్పందించి జలమండలి అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులతో ఆర్టీకే పింక్ బిల్డింగ్లో పర్యటించారు.