రాజేంద్రనగర్‌: ఎస్టీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ

50చూసినవారు
రాజేంద్రనగర్‌: ఎస్టీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు-2026 కోసం రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీసర్కిల్‌‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ తెలిపింది. అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 14 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. మరిన్ని వివరాలకు 6281766534 నంబరులో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్