రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ వద్ద డబ్బులు అడిగినందుకు టోల్ సిబ్బందిపై జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధికి తన ఐడి కార్డు చూపించి టోల్ మినహాయింపు కోరారు. ఆ శాఖకు టోల్ మినహాయింపు లేకపోవడంతో సిబ్బంది డబ్బులు అడిగారు. దీంతో హుస్సేన్ సిద్ధికి టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.