రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో రేపు (సోమవారం) నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. వర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రైతులను సమీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా1,500 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు 250 మంది చొప్పున రైతులను ఆహ్వానిస్తున్నారు.