గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామంటూ నిరుద్యోగులకు ఫ్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ గాలం వేసింది. బాధితుల నుండి విడతల వారిగా డబ్బులు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసినట్టు సమాచారం. ఒక్కొక్కరి నుండి దాదాపు రూ. 2 లక్షల వరకు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు గురువారం రోడ్డెక్కారు.