శంషాబాద్‌: కల్తీ మద్యం కలకలం.. 72 మద్యం బాటిళ్లు, కారు సీజ్‌

79చూసినవారు
శంషాబాద్‌ డీటీఎఫ్‌, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 72బ్లాక్ లేబుల్ కల్తీ మద్యం బాటిళ్లు, కారు, 2‌ఫోన్లను బుధవారం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం విలువ 20లక్షలు. కాటేదాన్‌లో ఓ ఫంక్షన్‌కు సరఫరా సమయంలో పట్టుబడ్డ ముఠా ఢిల్లీ లేబుల్స్‌తో ఖరీదైన మద్యం పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తుండగా బుక్‌ అయ్యింది. సేవించేవారు ప్రాణాలకే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్