సైబర్ నేరాలపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ ఏసీపీ హన్మంతరావు అన్నారు. గురువారం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అజాద్ ఇండస్ట్రీయల్ కంపెనీలో సైబర్ నేరాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. అపరిచిత ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయవద్దని, అదే విధంగా వాట్సాప్, ఫేస్ బుక్ లలో లింక్ లను ఓపెన్ చేయవద్దని ఏసీపీ సూచించారు.