హరి హర వీరమల్లు సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నేత శివ మాట్లాడుతూ, హరిహర రాయులు, పండుగ సాయన్న వంటి చారిత్రక వ్యక్తుల జీవితాలు వక్రీకరించారని ఆరోపించారు. సినిమా విడుదలకు ముందు అభ్యంతరకర అంశాలను సవరించాలని, లేకపోతే చిత్రం విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.