సదరం ఆధ్వర్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం వైద్యులకు మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, ఢిల్లీ ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ స్పెషలిస్టులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.