డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి... పోలీసులపైనే దాడి

64చూసినవారు
అమీర్ పేట్ లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. ఏకంగా ట్రాపిక్ పోలీసుల పైనే దాడికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి అమీర్ పేట్ లో ట్రాపిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ పోలీసులపైకి తిరగబడ్డాడు. వారిని బూతులు తిట్టాడు. ఓ పోలీసు గొంతు పట్టుకుని కొట్టబోయాడు. అక్కడున్న వారు అతడిని అడ్డుకున్నారు. ఈ వీడియో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్