హైదరాబాద్: అప్పుడే పుట్టిన కుక్క పిల్లలను తొక్కి చంపిన వ్యక్తి

62చూసినవారు
హైదరాబాద్: అప్పుడే పుట్టిన కుక్క పిల్లలను తొక్కి చంపిన వ్యక్తి
హైదరాబాద్‌ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీ అపార్ట్‌మెంట్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందన్న కోపంతో, వీధి కుక్కకు అప్పుడే పుట్టిన ఐదు కుక్క పిల్లలను గురువారం అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఓ వ్యక్తి కాలితో తొక్కి చంపేశాడు. నిస్సహాయంగా ఉన్న ఆ జీవులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్