

విమాన ప్రమాదం వేళ.. మానవత్వం చాటుకున్న స్థానికులు (వీడియో)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసేందుకు వందల సంఖ్యలో స్థానికులు ముందుకు వచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా నిస్వార్థంగా రక్త దానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో గంటల వ్యవధిలోనే రక్తదాన శిబిరాలు దాతలతో నిండిపోయాయి. అలాగే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి మంచినీరు కూడా అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అహ్మదాబాద్ ప్రజలు చూపిన దాతృత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.