ఎంతో చరిత్ర కలిగిన మోండా మార్కెట్ సమగ్ర అభివృద్ధికి త్వరలో ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం మోండా మార్కెట్ కలియతిరిగారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి.? సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.