బీఆర్ఎస్ నేతల్లో ఒకరు రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల పరువును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.