సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో గురువారం జరిగిన ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించకూడదని, మానవత్వంతో మతాన్ని జత చేస్తేనే లోకకళ్యాణం సాధ్యమని అన్నారు. “మతాలు వేరు, మానవత్వం వేరు కాదు. సేవే మాధవసేవ” అని ఆమె చెప్పారు. డాక్టర్ థామస్ సేవలు అభినందనీయం అంటూ ప్రతి ఒక్కరూ ప్రజల కోసం సేవ చేయాలని పిలుపునిచ్చారు.