ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పిడమర్తి రవి నేతృత్వంలో ఖమ్మం జిల్లా నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.