రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని జనరల్ బజార్ ప్రాంగణంలోని మల్లిఖార్జున స్వామి ఆలయంలో గురువారం అన్నకోటి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.