సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం జనప్రియ అపార్ట్మెంట్ ఐదో అంతస్థు నుంచి దూకి శ్రావణి (30) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే దీనికి కారణంగా భావిస్తున్నారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.