ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్దమయింది. ఈనెల 13 నుంచి 15వ తేది వరకు సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంభందించిన గాలిపటాలని ఎగురవేయనున్నారు.