సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను బుధవారం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్ కు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపాలని తలసాని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహించాలన్నారు.