బాలానగర్ పీఎస్లో సెమీ-క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా జరిగాయి. రవి కుమార్ ఆధ్వర్యంలో ఎలిమ్ ఏంబీ చర్చ్ యూత్ సహకారంతో నిర్వహించిన వేడుకల్లో బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, సీఐ నర్సింహారాజు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య పండుగలు జరుపుకోవాలని ఏసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.