సికింద్రాబాద్‌లో జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానం అందజేశారు. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ పండితులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 29న అమ్మవారి ఘటాల ఊరేగింపు, జూలై 13న లష్కర్ బోనాలు, 14న భవిష్యవాణి(రంగం) నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.