మత విద్వేషాలను ప్రేరేపించే వారిపై కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహం ధ్వంసం ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీయడమే అని మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.