Nov 20, 2024, 09:11 IST/మేడ్చల్
మేడ్చల్
హైదరాబాద్: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. వ్యక్తి మృతి
Nov 20, 2024, 09:11 IST
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మా కంపెనీ రియాక్టర్ లో బుధవారం రసాయన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్మికుడు అనిల్ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.