

పవన్, మహేశ్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు (వీడియో)
పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’, మహేశ్ బాబు ‘ఖలేజా’ సినిమాలతో తాను రూ.100 కోట్లు నష్టపోయానని నిర్మాత శింగనమల రమేశ్ అన్నారు. ‘నేను సినిమాలు చేసే సమయంలో మూడేళ్ల పాటు ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ లేదు. ఆరు నెలల్లోనే సినిమాలు పూర్తయ్యేవి. నా తలరాత బాగోక కొమరం పులి, ఖలేజా సినిమాలు మూడేళ్లు నిర్మాణంలోనే ఉన్నాయి. అప్పుడు బాగా నష్టాలు చూశా. ఏ హీరో పట్టించుకోలేదు. ఎవరూ ఫోన్ చేసిన పాపాన పోలేదు.’ అని ఓ ఈవెంట్లో చెప్పారు.