నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేస్తారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లాకు రావడం ఇదే మొదటిసారి.