గాంధీనగర్ డివిజన్లోని బస్తీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. శనివారం మాల బస్తీల్లో పర్యటించి బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఏవైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.