
కారు కిటికీలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి
కొత్తగా కొన్న కారు ఏడాదిన్నర బాలుడి పాలిట యమపాశమైంది. బాలుడి మెడ కారు కిటికీ అద్దాల్లో ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో చోటు చేసుకుంది. చకియా గ్రామానికి చెందిన రోషన్ ఠాకుర్ కొత్తగా కారు కొన్నారు. కారుకు పూజ చేయించేందుకు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లారు. పూజ చేయిస్తుండగా కొడుకు రేయాంశ్ కారులో ఉన్నాడు. కారు స్టార్ట్ చేయడంతో కిటికీ అద్దాలు వాటంతట అవే మూసుకుపోగా.. బాలుడి మెడ అద్దం మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు.