కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరికలు పెరిగాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఆదివారం రెండవ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నేత ఎండీ జహంగీర్ అజ్జు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.