కంటోన్మెంట్ పరిధిలో త్వరలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. శనివారం కంటోన్మెంట్ రాజీవ్ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నేపథ్యంలో భూములు కోల్పోతున్న బాధితులతో ఎమ్మెల్యే శనివారం సమావేశం నిర్వహించారు. వారి అభ్యంతరాలు తెలుసుకొని వారికి తగిన విధంగా న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తేలుకుంట సతీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.