సికింద్రాబాద్ ఆర్టీవో కార్యాలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబుల్ బెడ్ రూమ్స్, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ప్రజా పాలన, కులగణన సర్వే అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బేడ్ రూమ్స్ అందే విధంగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు త్వరగా వచ్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.