వసంత పంచమి సందర్భంగా కంటోన్మెంట్లోని పలు పాఠశాలలో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి హోమం, సరస్వతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు, వికాసం కోసం, విద్యా ప్రమాణాల పెంపునకు ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ప్రేరణనిచ్చేలా ఉంటాయని వారన్నారు.