స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ సామల హేమ అన్ననగర్లోని శిధిలావస్థలో ఉన్న చిన్న నాలాను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఇండ్ల మధ్యలో ఉండే నాలాను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, నాయకులు లక్ష్మి కాలనీవాసులు పాల్గొన్నారు.