ఓల్డ్ బోయినపల్లి డివిజన్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ డివిజన్ ప్రజలకు సూచించారు. మంగళవారం పీవీ ఎన్క్లేవ్, వెస్టీ టీచర్స్ కాలనీ, సాయిదుర్గా అపార్ట్మెంట్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీవీ ఎన్క్లేవ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెత్తను డంప్ చేస్తూ డంపింగ్ యార్డుగా మార్చుతున్నారని కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు.