రేణుదేశాయ్ తల్లి కన్నుమూత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'పునరపి జననం పునరపి మరణం, పురపి జననీ జాతరే శయనం' అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.