తాగునీటి సమస్య.. మల్కాజిగిరి ఎమ్మెల్యే వినతి

84చూసినవారు
తాగునీటి సమస్య.. మల్కాజిగిరి ఎమ్మెల్యే వినతి
వారానికోసారి తాగునీటిని సరఫరా చేస్తే ఎలా అని ఎమ్మెల్యే మర్రి రాజేశేఖర్ రెడ్డి జలమండలి జీఎం వినోద్ ను ప్రశ్నించారు. హిల్స్ టాప్ కాలనీ, రామాంజనేయనగర్, అయ్యన్న నగర్, న్యూ వెంకటేశ్వరనగర్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. త్వరగా నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్థానికులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే జీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్