
రాజరికం చూపించకండి.. మధ్యవర్తిత్వంతో సాల్వ్ చేసుకోండి: సుప్రీం
వైవాహిక తగాదాలో రాజరిక ప్రస్తావన అవసరం లేదంటూ, ప్రజాస్వామ్యంలో రాజులా ప్రవర్తించరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న గ్వాలియర్ మహిళ, తన భర్త రోల్స్ రాయస్ కారు, ముంబయిలో ఫ్లాట్ డిమాండ్ చేశాడని ఆరోపించింది. ‘‘ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. మధ్యవర్తిత్వంతో సాల్వ్ చేసుకోండి. లేకపోతే కఠిన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని ధర్మాసనం హెచ్చరించింది.